సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న అశోక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎంజే రోడ్డులోని విజేత ఎంటర్‌ప్రైజెస్‌లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.24 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. నిందితుడు గుజరాత్ నుంచి ఆ విత్తనాలు అనుమతి లేకుండా తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు - Fake Seeds
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే రోడ్డులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 24 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు