పోలీసులకు కరోనా కొత్త సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేసిన పోలీసులకు.. నేరగాళ్లను పట్టుకోవడంలో కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. గతంలో నేరగాళ్లను జంకూబొంకూ లేకుండా ఠాణాలకు తరలించేవారు. ఇబ్బందిపెట్టే వారిని బలవంతంగానైనా లాక్కెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా భయంతో నేరస్థులను చేతులతో తాకేందుకే భయపడాల్సి వస్తోందని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అది మరో సవాల్
"అందుకే బుజ్జగింపులతో వారిని ఠాణాలకు తరలిస్తున్నాం. ఠాణాకు సమీపంలో ఉన్న వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. బలవంతంగా తరలించాల్సి వస్తే ఠాణాలకు వెళ్లాక విధిగా శానిటైజ్ చేసుకుంటున్నాం. నేరస్థులను న్యాయస్థానానికి తరలించేప్పుడూ మరో సవాల్ ఎదురవుతోంది. కరోనా ప్రాథమిక పరీక్షలు చేయించిన తర్వాతే న్యాయమూర్తుల ఎదుట ప్రవేశ పెట్టాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం." అని వారు వాపోతున్నారు.