తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్ట్ గడ్డర్ల పనులను ప్రారంభించిన ఎస్​ఈ - polavaram project news

ఏపీ పోలవరం ప్రాజెక్టులో గడ్డర్ల ఏర్పాటు పనులను ప్రాజెక్టు ఎస్​ఈ, మేఘా కంపెనీ జీఎం ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్ట్ గడ్డర్ల పనులను ప్రారంభించిన ఎస్​ఈ
పోలవరం ప్రాజెక్ట్ గడ్డర్ల పనులను ప్రారంభించిన ఎస్​ఈ

By

Published : Jul 6, 2020, 11:11 PM IST

ఏపీ పోలవరం ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు స్పిల్ వే పూర్తయింది. దాదాపుగా అన్ని పిల్లర్లు 52 మీటర్ల ఎత్తుకు చేరుకోగా.. ప్రస్తుతం మేఘా ఇంజినీరింగ్ సంస్థ.. గడ్డర్లు ఏర్పాటు చేస్తోంది. పోలవరం ఎస్ఈ ఎం.నాగిరెడ్డి, మేఘా జీఎం ఎ.సతీశ్​ బాబు ఈ పనిని పూజలతో ప్రారంభించారు. 45 - 46 పిల్లర్ల మీద మొదటి గడ్డర్ ఏర్పాటు చేస్తున్నారు.

వర్షాకాలంలో వరదలు వచ్చినా పనులు ఆగకుండా కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలంలో బ్రిడ్జి పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే గడ్డర్ల ఏర్పాటు ప్రారంభించినట్లు మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవంబర్ నాటికి బ్రిడ్జి పనులు పూర్తి చేసి డిసెంబర్ నుంచి గేట్లు పెట్టే పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details