తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోలవరంపై 15 రోజుల్లో మరోసారి భేటీ..' - పోలవరం ప్రాజెక్టు అథారిటీ న్యూస్

పోలవరంలో 41.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు వీలుగా కాఫర్ డ్యాం పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తేల్చారు. పీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్, పోలవరం చీఫ్ ఇంజినీర్, పీపీఏ సభ్య కార్యదర్శి పాల్గొన్నారు.

POLAVARAM
15 రోజుల్లో మరోసారి భేటీ... పోలవరం ప్రాజెక్టు అథారిటీ స సమావేశం నిర్ణయం

By

Published : Dec 30, 2020, 3:24 PM IST

విజయవాడలో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసింది. 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. వీలైనంత త్వరగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని తేల్చారు.

పోలవరంలో 41.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు వీలుగా కాఫర్ డ్యాం నిర్మించనున్నారు. ఆ మేరకే భూసేకరణ, పునరావాస పరిహారం అమలు చేయాలని తీర్మానించారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్​ ఇంజినీర్, పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

ఇవీచూడండి:ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details