పోలవరం ప్రాజెక్టు వద్ద బిహర్, ఝార్ఖండ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. వీరు ఏపీలో తూర్పుగోదావరి జిల్లా నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి కాలినడకన వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోనగర్ వద్ద పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా లెక్క చేయకుండా ముందుకు కదిలారు. లాలా చెరువు కూడలి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో కూలీలను అడ్డగించి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదని... అధికారులతో మాట్లాడతామని.. ప్రస్తుతానికి ఎవరి స్థావరాల్లో వారు ఉండాలని పోలీసులు కోరారు.
'మీరు పంపిస్తారా... నడుచుకుంటూ వెళ్లమంటారా..?' - పోలవరం వలస కూలీల వార్తలు
పోలవరం ప్రాజెక్టు వద్ద పనిచేసే ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. వారంతా ఒక్కసారిగా కాలినడకన తమ స్వస్థలాలకు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డగించి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
!['మీరు పంపిస్తారా... నడుచుకుంటూ వెళ్లమంటారా..?' polavaram-migrant-laborers-protest-in-east-godavari in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7080714-296-7080714-1588749026519.jpg)
మీరు పంపిస్తారా... నడుచుకుంటూ వెళ్లమంటారా..?