తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో విష ప్రచారం తగదు' - రాజధాని రైతుల ఆందోళన

అమరావతిపై వైకాపా నాయకులు చేసే ఆరోపణలు వాస్తవాలు కాదని, విష ప్రచారమేనని ఏపీ రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని వేసిన కేసులను హైకోర్టు కొట్టివేయడమే దీనికి నిదర్శనమని అన్నారు.

amaravathi farmers
amaravathi farmers

By

Published : Jan 20, 2021, 12:11 PM IST

అమరావతిపై వ్యతిరేకతతో కొందరు నాయకులు ఇన్నాళ్లూ విషప్రచారం చేశారని ఏపీ రాజధాని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు, కూలీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుల దీక్షలు ఇవాళ్టికి 400వ రోజుకు చేరుకుటున్న సందర్భంగా ‘అమరావతి సంకల్ప ర్యాలీ’ నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు.

తుళ్లూరులో ఉదయం 9 గంటలకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రారంభమయ్యే ర్యాలీ పెదపరిమి, నెక్కల్లు, వెలగపూడి గ్రామాల మీదుగా మందడం వరకు సాగనుందని చెప్పారు. అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:'రామరాజ్య స్థాపన జరగాలంటే రామమందిరం నిర్మించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details