భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 3న హైదరాబాద్ రవీంద్రభారతిలో 75 మంది కవులచే కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ కేవీ రమణాచారి తెలిపారు.
ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో కవిసమ్మేళనం - Poet compound
ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 3 న హైదరాబాద్ రవీంద్రభారతిలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ కేవీ రమణాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 75 మంది కవులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.
Poet compound on April 3 in hyderabad Rabindranath
హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ వేడుకలను పర్యవేక్షిస్తుందని రమణాచారి వివరించారు.