హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ జేఎన్టీయూ ప్రాంగణంలోని మహంకాళి దేవాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్యాంపస్‌లో 50 సంవత్సరాల క్రితం తాను చదువుకున్నట్లు సభాపతి తెలిపారు. అమ్మవారి దీవెనలు రాష్ట్రంపై నిండుగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాలను ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్నామని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు.
మహంకాళిని దర్శించుకున్న సభాపతి పోచారం, నాయిని - nayini narasimhareddy
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ సమీపంలో జేఎన్టీయూ ప్రాంగణంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి బోనాలు సమర్పించారు.
మహంకాళిని దర్శించుకున్న సభాపతి పోచారం, నాయిని