తెలంగాణ

telangana

ETV Bharat / city

బండి సంజయ్‌కి ప్రధాని ఫోన్‌.. పోలింగ్ సరళిపై ఆరా - ప్రధాని మోదీ తాజా వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్ చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్​ సరళిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ నూతనోత్సాహంతో నడుచుకోవడం పట్ల ప్రధాని హర్షం చేశారని తెలిపారు.

బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్‌.. పోలింగ్ సరళిపై ఆరా
బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్‌.. పోలింగ్ సరళిపై ఆరా

By

Published : Dec 2, 2020, 1:33 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడానికి శ్రమించిన రాష్ట్ర శాఖ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. నూతన ఉత్సహంతో పార్టీ క్యాడర్‌ నడుచుకోవడం పట్ల ప్రధాని హర్షం చేశారని తెలిపారు.

ఎన్నికల స్థితిగతులపై నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని బండి సంజయ్‌ వెల్లడించారు. దాదాపు 10నిమిషాల పాటు ఎన్నికల సరళి, భాజపా కార్యకర్తలపై దాడి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారని బండి సంజయ్‌ వివరించారు..

ఇవీ చూడండి:'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

ABOUT THE AUTHOR

...view details