హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద వర్షపాతం ఈ ఏడాదే నమోదైందని కేటీఆర్ వెల్లడించారు. క్యుములోనింబస్ మేఘాల వల్లనే అసాధారణ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. 1908లో మూసీకి వరదలు పోటెత్తాయని చరిత్ర చెబుతోందన్న కేటీఆర్.. 1916 తర్వాత ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయన్నారు.
చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్లే వందలాది కాలనీలు నీటమునిగాయని కేటీఆర్ తెలపారు. ప్రభుత్వం అప్రమత్తతతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. చాలావరకు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగామన్నారు. వైపరీత్యాలను ఎదుర్కొవడానికి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 800 మందితో డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అవసరమైతే మరో రూ.100 కోట్లు..
క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని.. తనతోపాటు ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించారన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు వెల్లడించారు. తక్షణ సాయం కోసం సీఎం రూ.550 కోట్లు కేటాయించారని.. బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు.
4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరద సాయం అందించామన్న కేటీఆర్.. సాయం అందిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించామని స్పష్టం చేశారు. బాధితులందర్ని ఆదుకుంటామని.. అవసరమైతే మరో రూ.100 కోట్లు కేటాయిస్తామని కేటీఆర్ వెల్లడించారు. పంటనష్టంపై నివేదిక రాగానే సీఎం నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. సీఈ స్థాయి అధికారితో మూడేళ్లలో ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు.
సాయం చేసినా.. ధర్నా చేశారు..