తెలంగాణ

telangana

ETV Bharat / city

అంధ విద్యార్థినికి ప్రధాని మోదీ ప్రశంస, ఎందుకో తెలుసా

ఏపీలోని విశాఖలో ఉన్న సాగర్‌నగర్‌ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్‌.మాధురిని ప్రధాని మోదీ ప్రశంసించినట్లు ప్రిన్సిపల్‌ ఎం.మహేశ్వరరెడ్డి వెల్లడించారు. జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారన్నారు.

By

Published : Aug 16, 2022, 8:01 AM IST

modi
modi

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంలో ఉన్న సాగర్‌నగర్‌ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్‌.మాధురి జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారని ప్రిన్సిపల్‌ ఎం.మహేశ్వరరెడ్డి సోమవారం పేర్కొన్నారు.

ఈనెల 10వ తేదీన పాఠశాలలో పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో జెండాలోని మూడు రంగులను తాకుతూ దేశభక్తి అనుభూతిని పొందానని మాధురి సంతోషం వ్యక్తం చేసింది. ఈ అంశం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తన ట్విటర్‌లో ఉంచారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించి.. మాధురి చెప్పిన విషయం నిజమని, జాతీయ జెండాలోని మూడు రంగులు దేశ ప్రజలందరి హృదయాలను తాకాయని అభినందనలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details