తెలంగాణ

telangana

ETV Bharat / city

'మోదీకి తెలంగాణ వంట రుచి చూపిస్తా..' - modi hyderabad tour

Chef Yadamma : ప్రధాన మంత్రి మోదీతో సహా కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఇవాళ తెలంగాణ వంట రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవెల్లి మండలం గుడాటిపల్లికి చెందిన యాదమ్మ తెలంగాణ రుచులను తయారు చేసి వీరందరికి వడ్డించనున్నారు. భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్‌ కూడా తెలంగాణ స్టైల్‌లోనే ఉంటాయని చెప్పారు.

Chef Yadamma
Chef Yadamma

By

Published : Jul 3, 2022, 8:41 AM IST

Chef Yadamma : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి హాజరైన ముఖ్య నాయకులకు తెలంగాణ సంప్రదాయ వంటలను రుచి చూపిస్తామని గూళ్ల యాదమ్మ చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఇలా సమావేశాలకు హాజరైన అందరికీ రుచికరమైన వంటలు వండడానికి సిద్ధమయ్యామని అన్నారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన యాదమ్మ బృందం భాజపా కార్యవర్గ సమావేశాలకు వేదికైన హైటెక్స్‌కు శనివారం చేరుకుంది. గంగవాయిలి కూర, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, ముద్దపప్పు, పప్పుచారు, పచ్చిపులుసు ఇలా మొత్తం 25 రకాల వంటలను దేశ ప్రధానికి రుచి చూపించబోతున్నానని యాదమ్మ తెలిపారు.

'భోజనంతో పాటు స్నాక్స్ కూడా తెలంగాణ స్టైల్‌లోనే తయారు చేస్తున్నాం. చిక్కుడుకాయ టమాట, ఆలు కుర్మా, వంకాయ మసాల, దొండకాయ ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమాట ఫ్రై, బీరకాయ మీల్‌మేకర్ ఫ్రై, మెంతికూర పెసరపప్పు, గంగవాయిలి కూర, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, ముద్దపప్పు, పప్పుచారు, పచ్చిపులుసు ఇలా మొత్తం 25 రకాల వంటలను దేశ ప్రధానికి రుచి చూపించబోతున్నాను. బగార, పులిహోర, పుదీనా రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ చట్నీ, టమాటా చట్నీ, సోరకాయ చట్నీతో పాటు బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు సిద్ధం చేస్తున్నాం. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి వంటి స్నాక్స్ కూడా తయారు చేస్తున్నాం.' -- యాదమ్మ, తెలంగాణ చెఫ్‌

Chef Yadamma to cook for pm modi :ఎక్కడ బహిరంగ సభలు జరిగినా.. పెద్ద వేడుకలైనా.. వారికి వండిపెట్టానని.., ఇలా తన వంటలు రుచి చూసిన అనేకమంది నేతలు ఈ అవకాశం కల్పించారన్నారు. ఎంపీ బండి సంజయ్‌ ఎన్నోసార్లు మెచ్చుకున్నారని చెప్పారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు వంట తనదేనని, మంత్రి గంగుల కమలాకర్‌, వివిధ పార్టీల నాయకుల సమావేశాలకే కాదు ఆలయాల్లో ఉత్సవాలకు వంటలు చేసే భాగ్యం తనకు దక్కిందని యాదమ్మ తెలిపారు. ప్రధానమంత్రి సారు కూడా తెలంగాణ రుచులను చూడాలనుకుంటున్నారు.. వండిపెట్టాలని సంజయ్‌ అడగడంతో తాము ఇక్కడికి వచ్చామని యాదమ్మ మురిసిపోయారు.

ABOUT THE AUTHOR

...view details