తెలంగాణ

telangana

ETV Bharat / city

మొక్కలతో ముక్క.. వీగన్స్‌ కోసం స్పెషల్ - వీగన్ల కోసం మొక్కలతో చేసిన మాంసం

Plant Based Meat For Vegans : ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్‌లుగా మారుతున్నారు. కొందరైతే ఏకంగా వీగన్‌ బ్యాచ్‌లోకి చేరిపోతున్నారు. అయితే వీరికి ఎప్పుడైనా చికెన్ టిక్కా లాగించాలనిపిస్తే.. మటన్ 65పై మనసు లాగితే ఎలా అంటారా..? అలాంటి వారి కోసమే అచ్చం లుక్‌లో నాన్‌వెజ్ ఐటంలా కనిపించడమే గాక.. టేస్ట్‌లోనూ ముక్క రుచిని ఆస్వాదించేలా కొన్ని రెస్టారెంట్‌లు మొక్కలతో చేసిన మాంసం డిషెస్‌ని అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వీగన్ సంస్కృతి పెరుగుతుండటంతో వీగన్ ఫుడ్ అందించే రెస్టారెంట్‌లు కూడా రోజుకోటి పుట్టుకొస్తున్నాయి.

Plant Based Meat For Vegans
Plant Based Meat For Vegans

By

Published : Jul 5, 2022, 12:12 PM IST

Plant Based Meat For Vegans : భాగ్యనగరం భిన్న రకాల రుచులకు నెలవు.. మాంసాహారం, శాకాహారం ఏది కావాలన్నా.. అందులో వందలాది వైవిధ్యాలు చిటికెలో కళ్లముందుకొచ్చేస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ మీట నొక్కగానే దక్కన్‌ రుచులతో పాటు ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలు, విదేశీ వంటకాలు ప్రత్యక్షమవుతాయి.

Vegan Food Restaurants in Hyderabad : ఇటీవల నగరంలో వీగన్‌ సంస్కృతి పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగానే ప్రత్యేక వీగన్‌ కెఫేలు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. తాజాగా ‘మొక్కలతో చేసిన మాంసం’ ట్రెండ్‌ అవుతోంది. మూగజీవాలపై ప్రేమ చూపించే చాలా మంది నగరవాసులు వీగన్లుగా మారిపోతున్నారు. వీరికోసం కొన్ని అంకుర సంస్థలు ప్రత్యేక రుచులను ప్యాకేజ్డ్‌ పుడ్స్‌గా అందిస్తుండటం విశేషం.

వీగన్లు అంటే.. జంతువులను హింసించి వాటి నుంచి తయారు చేసే పదార్థాలను ముట్టుకోరు. ఆవు, గేదె పాలు.. ఆ పాలతో తయారు చేసిన పదార్థాలు సైతం తీసుకోరు. మొక్కల నుంచి సహజసిద్ధంగా తయారు చేసిన వంటలనే తింటారు.

ప్లాంటారియం ఏర్పాటు.. ఫుడ్‌ కల్చర్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో వీగన్‌ కల్చర్‌ క్రమక్రమంగా పెరుగుతోంది. నగరంలో సుమారు 10వేల మందికి పైగా వీగన్లు ఉన్నారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ.. జీవహింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిసున్నారు. వీరికి తగ్గట్టుగానే వీగన్‌ కెఫేలు పెరుగుతున్నాయి. ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్‌ను మాత్రమే అందించే ఈ కెఫేలకు ఆదరణ పెరుగుతోంది. ప్లాంటారియంలో ప్రత్యేక వీగన్‌ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో ఐదు ప్లాంటారియం వీగన్‌ కెఫేలు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, సైనిక్‌పురి వంటి ప్రాంతాల్లో కొన్ని సెమీ వీగన్‌ కెఫేలు నడుస్తున్నాయి.

మొక్కలతో చేసే వంటకాలివే..వీగన్‌ డైట్‌లో మొక్కల నుంచి తయారు చేసిన పదార్థాలే ఉంటాయి. మాంసాహారానికి పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. మొక్కలతోనే విభిన్న రకాల మాంసాహార వంటకాలు చేస్తూ ‘ఆహా’ అంటున్నారు. ఉదాహరణకు గచ్చిబౌలిలోని ప్లాంటేరియం కేఫెలో 100 శాతం ప్లాంట్‌ బేస్డ్‌ అంటూ కీమా పులావ్‌, ఎగ్‌ రైస్‌, చికెన్‌ కర్రీ, టోఫు బటర్‌ మసాలా, ఎగ్‌ బుర్జీ, కీమా పరోటా, టోపు పరోటా, చిల్లీ మాక్‌ చికెన్‌ వంటకాలు లభిస్తున్నాయి.

బేక్డ్‌ జాకెట్‌ పొటాటోస్‌, ఫ్రెష్‌ సమ్మర్‌ రోల్స్‌, క్రిస్పీ మోక్‌ చికెన్‌ 65, స్ట్రాబెరీ మౌజీ కేక్‌, ఓట్‌ పాన్‌ కేక్స్‌, వీగన్‌ బటర్‌, నాచో చీజీ సాస్‌, పీనట్‌ బటర్‌, పిజ్జాలు, కేక్స్‌ లాంటి వెరైటీలు ఉన్నాయి. వీగన్‌ పెరుగు, పాలు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు వచ్చేశాయి. ఈ-కామర్స్‌ స్టోర్లు వందల సంఖ్యలో వీగన్‌ ప్రొడక్ట్స్‌ పంపిణీ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details