హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్దామ రెడ్డి, రాజిరెడ్డి భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నాయకత్వం ఆర్టీసీ సమ్మెపై చర్చించిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, మిలియన్ మార్చ్ నిర్వహణపై ప్రధానంగా నేతలు చర్చించారు.
అదిరేది లేదు.. బెదిరేది లేదు..!
ప్రభుత్వం విదించిన డెడ్‌లైన్‌కు బెదరకుండా... విధుల్లో చేరకుండా సమ్మెకు సహకరిస్తున్న కార్మికులకు ఐకాస కన్వినర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తదుపరి కార్యాచరణ చేపడతున్నామని వెల్లడించారు. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన పూర్తికాలేదని, కార్యాలయ సిబ్బందిలో కొంతమందే విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు. ఈనెల 9న జేఏసీనిర్వహించే మిలియన్ మార్చ్‌కు మద్దతివ్వాలని లక్ష్మణ్‌ను కోరగా.. అందుకాయన అంగీకరించారు.
ఆర్టీసీ ఐకాస మిలియన్ మార్చ్‌కు భాజపా మద్దతు ఇదీ చదవండి: ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!