దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ రంగాల్లో అనూహ్య మార్పులు తప్పనిసరయ్యాయి. డిజిటల్, మొబైల్ టెక్నాలజీ, శాటిలైట్, డ్రోన్ సాంకేతికత, కృత్రిమ మేథ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, అంతరిక్ష పరిజ్ఞానం, రోబోటిక్స్ టెక్నాలజీ.. ఇలా ఎదో ఒక రూపంలో సాగుపై సాంకేతికత ప్రభావం ఉంటోంది. ఇందుకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) చర్యలు చేపట్టింది.
వినియోగదారుల ఆహార అలవాట్లకు అనుగుణంగా.. ఐదారేళ్లుగా కార్నెల్ వర్సిటీ, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, పొనెహెం యూనివర్సిటీ, మనీలా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలను ఎంపిక చేసుకుని సీడ్స్ సైన్స్ టెక్నాలజీ, వరి పరిశోధనల్లో కలిసి పనిచేస్తోంది.