ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై సత్వరమే విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రజా ప్రతినిధులపై కేసులను సత్వరమే విచారణ జరపాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఇప్పటి వరకూ పూర్తి కాలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్ - ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్
ప్రజాప్రతినిధుల కేసులపై సత్వరమే విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేసింది. కేసుల విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని పిటిషన్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోర్టును కోరారు.
ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్
కేసుల విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని, విచారణపై నెలవారీ స్థాయినివేదికలు తెప్పించుకోవాలని పిటిషన్లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, డీజీపీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.
ఇవీ చూడండి: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..