PIG COMPETITIONS: గుర్రం పందేలు, ఎడ్ల పందేలు, కొడి పందేలు మీరు చూసే ఉంటారు. ఇందులో కొత్త ఏం ఉంటుందన్నది మీ ప్రశ్నే అయితే.. దానికి సమాధానం పందుల పందేలు. వినటానికి వింతగా ఉన్నా.. మీరు చదువుతోంది నిజమే. ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
PIG COMPETITIONS : పందులు పందేలు.. ఎక్కడో తెలుసా..!
PIG COMPETITIONS: సాధారణంగా కోడి పందాలు, ఎద్దులు బండలు లాగే పోటీలు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడక్కడ పొట్టేళ్ల పోటీలు నిర్వహించడం చూస్తుంంటాం. కానీ అందుకు భిన్నంగా.. పందులు పోటీలను నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? అది ఎక్కడో చూడాలని ఆసక్తిగా ఉందా? అయితే ఓ లుక్కేయండి.
PIG COMPETITIONS : రసవత్తరంగా పందులు పందేలు.. ఎక్కడో తెలుసా..
ద్వారకా తిరుమల శివారు వెంకటకృష్ణాపురం రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో పందుల పోటీలను ఏర్పాటు చేశారు. ద్వారకాతిరుమల, రాజమండ్రికి చెందిన పందులను బరిలోకి దింపారు. అయితే బరిలో దిగిన రెండు పందులలో.. పారిపోకుండా ఎక్కువ సేపు పోరాడే పందిని నిర్వాహకులు విజేతలుగా ప్రకటిస్తారు. ద్వారక తిరమలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలో రాజమండ్రికి చెందిన పంది పారిపోయింది. దీంతో ద్వారకా తిరుమలకు చెందిన పందిని విజేతగా ప్రకటించారు.
ఇవీ చదవండి: