తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎస్సీ వర్గీకరణ కోరుతూ మార్చి 18,19లో ఛలో దిల్లీ' - Pidamarti Ravi

ఎస్సీ వర్గీకరణ మీద భాజపా తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎస్సీ కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్​ పిడమర్తి రవి.

Pidamarti Ravi Chalo Delhi Call
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : పిడమర్తి రవి

By

Published : Feb 18, 2020, 7:43 PM IST

Updated : Feb 18, 2020, 9:44 PM IST

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్రంలో భాజపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్సీ కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తక్షణమే ప్రకటించాలని హైదరాబాద్​లో డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ విషయంలో స్పందించాలని సూచించారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించకపోతే.. 'మాదిగల పంతం.. బిజేపి పంతం' నినాదంతో ముందుకు పోతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ మార్చి 18, 19 తేదీలలో ఛలో దిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : పిడమర్తి రవి
Last Updated : Feb 18, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details