కళ్లకు గంతలు కట్టుకొని 29 నిమిషాల 19 సెకన్లలో పియానోతో 20 పాటలు వాయించి... వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించాడు 13 ఏళ్ల హరిహరన్ నాయుడు. ఈ మేరకు సికింద్రాబాద్ లయన్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మెడల్, సర్టిఫికేట్ అందజేశారు. పిల్లలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. తెలంగాణకు చెందిన బాలుడు ఈ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందని... మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అన్నారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు 13 ఏళ్ల హరిహరన్. ఏకంగా 29 నిమిషాల 19 సెకన్ల పాటు కళ్లకు గంతలు కట్టుకొని పియానో వాయించాడు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మెడల్, ప్రశంసపత్రం అందుకున్నాడు.
రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు
కళ్లకు గంతలు కట్టుకొని ఈ రికార్డ్ సాధించడం ఇదే మొదటిసారి అని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ చీఫ్ ఇంఛార్జ్స్వర్ణ శ్రీ గుర్రం అన్నారు. హరిహరన్ ఈ రికార్డ్ సాధించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రోత్సహించారు. చదువు ఒక్కటే కాకుండా వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప స్థాయికి చేరుకుంటారని హరిహరన్ తల్లి అరుణ అన్నారు. హరహరన్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నట్టు తెలిపింది.
ఇదీ చూడండి:ఆకాశమంత పందిరిలో హద్దుల్లేని ఆనందం