తెలంగాణ

telangana

ETV Bharat / city

మందుబాబులకు వినూత్న రీతిలో వైద్యుడి అవగాహన - మొవ్వలో మద్యం వార్తలు

మద్యం దుకాణం వద్ద ఓ వైద్యుడు.. మందు బాబులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. మద్యం సేవించొద్దంటూ మందు కోసం బారులు తీరిన వారికి విజ్ఞప్తి చేశారు. కానీ మందే ముఖ్యం.. ఎవరెన్ని చెప్పినా వినమనుకున్నారో ఏమో.. వారంతా వైద్యుడి మాటలు పెడ చెవిన పెట్టి మద్యం కొనుక్కుంటున్నారు.

మందుబాబులకు వినూత్న రీతిలో వైద్యుడి అవగాహన
మందుబాబులకు వినూత్న రీతిలో వైద్యుడి అవగాహన

By

Published : May 10, 2020, 9:13 PM IST

Updated : May 10, 2020, 9:26 PM IST

ఏపీలోని కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో బార్‌ షాపు ముందు బారులు తీరిన మందు బాబులకు.. స్థానిక వైద్యుడు శివరామకృష్ణ వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ఎండను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం లైన్‌లో నిలబడిన వాళ్లకు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ సూచించారు. ఏదైనా జరిగితే మీతో సహా మీ కుటుంబం కూడా నష్టపోతుందని వివరించారు. అయినా లెక్కచేయని మద్యం ప్రియలు వైద్యుడి మాటలను పక్కనపెట్టి మద్యం కొనుగోలు చేశారు.

మందుబాబులకు వినూత్న రీతిలో వైద్యుడి అవగాహన
Last Updated : May 10, 2020, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details