ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా పడింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు విచారణ చేయకూడదు?
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
తమ వాదనలతో హైకోర్టు సంతృప్తి చెందింది: శ్రవణ్
టెలీకమ్యూనికేషనల్ నిపుణులతో పర్యవేక్షించాలని తాము కోర్టును కోరినట్లు న్యాయవాది శ్రవణ్ తెలిపారు. ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో వివరాలు పొందుపరచాలన్నారు. పత్రిక క్లిప్పింగ్‌తోనే ఎలా అడుగుతారని న్యాయస్థానం ప్రశ్నించిందన్నారు. ఈమధ్య కాలంలో న్యాయవ్యవస్థపై దాడి జరిగిందని వాదించామని.... తమ వాదనల అనంతరం హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని శ్రవణ్ తెలిపారు. ప్రభుత్వ సమాధానం కోసం ఎల్లుండికి విచారణ వాయిదా వేశారన్నారు. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.