తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్చి 3న పీజీ ఈసెట్​ నోటిఫికేషన్​ - m tech notification

ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మా ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ నోటిఫికేషన్​ మార్చి 3న విడుదల కానుంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 28 నుంచి మే 31 వరకు ఆన్​లైన్​లో పరీక్షలు జరుగుతాయి.

PGECET Schedule finalized notification will be on march 3
మార్చి 3న పీజీ ఈసెట్​ నోటిఫికేషన్​

By

Published : Feb 19, 2020, 11:59 PM IST

ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మా ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ షెడ్యూలు ఖరారైంది. మార్చి 3న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 6 వరకు రూ.500.... మే 13 వరకు రూ. 2వేల.. మే 20 వరకు రూ. 5 వేల...మే 26 వరకు రూ.10వేలఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు.

మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. జూన్ 15న ఫలితాలు ప్రకటిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, ఇతరులు వెయ్యి రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పీజీ ఈసెట్ కన్వీనర్​గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమార్ వ్యవహరిస్తున్నారు.

ఇవీచూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి

ABOUT THE AUTHOR

...view details