తెలంగాణ

telangana

ETV Bharat / city

PG CET: అక్టోబర్​లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ - pg cet schedule in ap

ఏపీ పీజీ సెట్-2021 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబర్​లో జరగనుంది. ఉన్నత విద్యామండలి పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి దాకా విశ్వవిద్యాలయాల వారీగా పరీక్షలు జరుగుతుండగా.. ఇక నుంచి ఉమ్మడిగా నిర్వహించనున్నారు.

pg-cet-exams
PG CET: అక్టోబర్​లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ

By

Published : Jul 6, 2021, 9:46 AM IST

పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021ను ఏపీ ఉన్నత విద్యామండలి అక్టోబర్​లో నిర్వహించనుంది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల వారీగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను అన్నింటికీ కలిపి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షలు పూర్తి కానందున అక్టోబరులో నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూలు మినహా మిగతా అన్ని వర్సిటీల్లోని పీజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని వర్సిటీల్లో కలిపి 12వేల వరకు సీట్లు ఉండగా.. 50వరకు వివిధ రకాల కోర్సులున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details