కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ఫలితంగా.. ఏపీలోనూ పెట్రోలు లీటరుపై 1.51 రూపాయలు, డీజిల్‌పై 2.22 రూపాయల మేర వ్యాట్ తగ్గింది. దీని ఫలితంగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి డీజిల్‌పై 888 కోట్ల రూపాయలు, పెట్రోల్‌పై 226 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయం కోల్పోనుంది.
కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1,114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని ఆంధ్రప్రదేశ్ అధికారులు అంచనా వేస్తున్నారు.