'మా వద్దే పెట్రోల్ కొనండి'.. రేట్లు తగ్గిస్తూ బంకుల ఆఫర్లు..! - petrol price in AP
Petrol prices reduced in AP : ఓ వైపు చమురు ధరలు పెరిగిపోతున్నాయని సామాన్యూలు లబోదిబోంటున్నారు. పెట్రోల్, డీజిల్ మాటెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. కానీ.. ఏపీలోని కడపలో రెండు పెట్రోల్ బంక్‌ల మధ్య నెలకొన్న పోటీ.. వినియోగదారులకు ఊరటనిస్తోంది!
petrol price reduced in kadapa
Petrol prices reduced in AP : ధర తగ్గింపు అంటూ ఇప్పటి వరకు ఏపీ సరిహద్దుల్లోని పెట్రోలు బంకులకే పరిమితమైన బోర్డులు.. కడపలోని రెండు బంకుల్లోనూ వెలిశాయి. తమ వద్ద లీటర్‌కు 2 రూపాయలు తక్కువ ధర అని హెచ్‌పీ పెట్రోలు బంక్ ఎదుట బోర్డు పెట్టగా... దీనికి పోటీగా ఎస్సార్ పెట్రోలు బంక్ వాళ్లు లీటర్‌కు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. రాజంపేట వెళ్లే మార్గంలోని ఈ రెండు పెట్రోలు బంక్‌లు పోటీపడటం వినియోగదారులకు కలిసి వస్తోంది.