తెలంగాణ

telangana

ETV Bharat / city

Fuel Price: భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దీపావళి పర్వదినం వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గాయి.

petrol and diesel prices
petrol and diesel prices

By

Published : Nov 4, 2021, 11:19 AM IST

చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో తెలంగాణలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్‌ సుంకంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై 12.79 చొప్పున ఊరట కలిగింది. దీంతో గురువారం నగరంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. డీజిల్‌ రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.


రూ.7 చొప్పున తగ్గించిన ‘భాజపా’ రాష్ట్రాలు

చమురు ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించిన క్రమంలోనే దేశంలోని పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఈ మేరకు పెట్రోలు, డీజిల్‌ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. ఈ రెండు ఇంధనాలపై అసోం, మణిపుర్‌, త్రిపుర, గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఫలితంగా కేంద్ర తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోలు రూ.12, డీజిల్‌ రూ.17 మేర చవక కానున్నాయి.

ఇదీ చూడండి:కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు- పెట్రో ధరలపై వ్యాట్​ తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details