పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం ప్రజా రవాణాపై పడుతోంది. గత 21 రోజులుగా పెట్రో ధరలు వరసగా పెరుగుతున్నాయి. ఇవాళ పెట్రోలుపై 26పైసలు, డీజిల్‌పై 21పైసలు పెరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.83.44, డీజిల్ రూ.78.57కు పెరిగింది. 21 రోజుల్లో పెట్రోలుపై రూ.9.47, డీజిల్‌పై రూ.10.75లను చమురు సంస్థలు పెంచాయి. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 5వేల బస్సులను 18 లక్షల కి.మీ.ల వరకు తిప్పుతున్నారు. రోజుకు రూ.2.5 కోట్లు ఆర్టీసీ కేవలం డీజిల్ పైనే ఖర్చు చేస్తోంది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.36లక్షల భారం పడుతోంది.
డీజిల్ కోసమే రూ.250కోట్లు
అంతరాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులు నడిపితే 10వేల బస్సులను సుమారు 36 లక్షల కి.మీ.ల మేరకు తిప్పాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులకు ఏటా 25 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తారు. ఇదే విధంగా కొనసాగితే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం డీజిల్ కోసమే ఏడాదికి రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు పేర్కొంటున్నారు.