దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని పేట్ల బురుజు పోలీసు శిక్షణా కేంద్రం ఎంపికైనట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 2019-20 ఏడాదిలో బెస్ట్ ట్రైనింగ్ సెంటర్‌గా ఎన్నికైన పాతబస్తీ పేట్లబురుజులోని శిక్షణా కేంద్రానికి ఇంఛార్జ్‌గా ఉన్న సీపీ ఎల్ఎస్ చౌహాన్‌కు అభినందనలు తెలిపారు.
'పేట్లబురుజు'.. దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ - india's best police training center is petla burj
దేశంలోనే ఉత్తమ పోలీసు శిక్షణా కేంద్రంగా హైదరాబాద్‌లోని పేట్లబురుజు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎంపికైంది. 2019-20 సంవత్సరానికి గానూ ఈ ట్రీఫీని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌గా పేట్లబురుజు పీటీసీ
వివిధ భాగాల్లో వందలాది మంది పోలీసులు పీటీసీలో శిక్షణ పొందారని.. ఇక్కడి శిక్షణ వారిని వారివారి విభాగాల్లో అత్యుత్తమ సేవలందించేలా తీర్చిదిద్దిందని సీపీ తెలిపారు. ట్రోఫీతో పాటు రూ.2 లక్షలను కేంద్రం హోం శాఖ ప్రకటించినట్లు వెల్లడించారు. ఉత్తమ శిక్షణ కేంద్రంగా ఎంపికవ్వడానికి కృషి చేసిన సిబ్బందిని సీపీ సత్కరించారు.
- ఇదీ చూడండి :ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా మామునూరు పీటీసీ..