Palamuru Rangareddy Lift Irrigation Scheme: రాజకీయ ప్రతీకారేచ్ఛతోనే పిటిషనర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ పథకం పనుల్లో అవినీతి చోటు చేసుకుందంటూ మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పాలమూరు రంగారెడ్డిపై ప్రతీకారేచ్ఛతోనే పిటిషన్లు
Palamuru Rangareddy Lift Irrigation Scheme రాజకీయ ప్రతీకారేచ్ఛతోనే పిటిషనర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ పథకం పనుల్లో అవినీతి చోటు చేసుకుందంటూ మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Palamuru Rangareddy Lift Irrigation
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘ఒకే ప్రాజెక్ట్, ఒకే టెండర్‌లోని అంశాలపై రకరకాల కేసులు వేస్తున్నారు. అటువంటి వ్యాజ్యాలతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోంది’’ అని ధర్మాసనానికి విన్నవించారు. వాదనల అనంతరం విచారణను ఆగస్టు 30కి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవీ చదవండి: