దేవరయాంజల్ భూముల విచారణపై హైకోర్టులో పిటిషన్ - దేవరయాంజాల్ భూముల కేసు వార్తలు

18:48 May 07
దేవరయాంజల్ భూముల విచారణపై హైకోర్టులో పిటిషన్
దేవరయాంజాల్ భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన 1014 జీవోను సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలైంది. దేవరయాంజాల్ భూముల్లో ప్రభుత్వం జోక్యం వద్దని విజ్ఞప్తి చేస్తూ.. సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు అత్యవసర పిటిషన్‌ను వేశారు. పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
సీతారామచంద్రస్వామి వారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఐఏఎస్ల కమిటీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారుల బృందం అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించింది. అనుమతులు లేకుండా గోదాములు నిర్మించారని తేల్చింది. పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి కమిటీ సర్వే చేస్తోంది. పుల్లయ్య పేరుతో ఉన్న భూములు మధ్యలో రామచంద్రయ్య పేరుతో మారాయని గుర్తించింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరుపుతుండగా.. ప్రభుత్వ జోక్యం వద్దంటూ సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీచూడండి: