తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల వివాదంపై హైకోర్టులో ఎంపీ రేవంత్ పిటిషన్​ - హైకోర్టు

రెవెన్యూ అధికారులు తన భూములకు నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు. ఆ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Petition in MP Rewant High Court on gopanpally land dispute at rangareddy district
భూముల వివాదంపై ఎంపీ రేవంత్ హైకోర్టులో పిటిషన్​

By

Published : Mar 6, 2020, 9:17 PM IST

రంగారెడ్డి జిల్లా గోపనపల్లి భూముల విషయంలో చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తన భూముల్లో రెవెన్యూ అధికారులు చొరబడుతున్నారని, నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఆ భూముల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఒకవేళ తీసుకుంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తామని అన్నారు. ఏజీ వివరణను నమోదు చేసిన హైకోర్టు... చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆదేశిస్తూ పిటిషన్​పై విచారణను ముగించింది.

ఇదీ చూడండి :ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: క్లీన్​గా మారిన నాగర్​కర్నూల్ కలెక్టరేట్​

ABOUT THE AUTHOR

...view details