ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Intermediate First year Exams) రద్దు చేయాలని హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ తల్లిదండ్రుల సంఘం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు.
Telangana High Court :ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ - inter first year exams
11:58 October 21
Telangana High Court : ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
పరీక్షలు లేకుండా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ అయిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలను(Inter first year exams) నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కరోనా కారణంగా మే నెలలో జరగాల్సిన ఇంటర్ ప్రథమ(Intermediate First year Exams), ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించలేదు. ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు తొలి ఏడాదిలో వచ్చిన మార్కులనే కేటాయించి ఇటీవల ఫలితాలు కూడా వెల్లడించారు. ప్రథమ ఏడాది విద్యార్థులను మాత్రం రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు.
మరోవైపు ఇంటర్ పరీక్షల(Intermediate First year Exams)పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Education Minister Sabitha Indra Reddy) సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈనెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Intermediate First year Exams)నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే జిల్లా ఇంటర్ విద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి సబిత మాట్లాడుతున్నారు.
తొలుత అక్టోబర్ 25న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Intermediate First year Exams)నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా.. అక్టోబర్ 31, నవంబర్1కి మార్చారు. మళ్లీ ఇప్పుడు అక్టోబర్ 25నే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.