తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్​ఈసీ నిమ్మగడ్డపై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం - ap high court on SEC

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈ​సీగా కొనసాగడం సరికాదంటూ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత ఐజీ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ (కోవారెంటో ) పిటిషన్ వేశారు. నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు .

ap high court
ఎస్​ఈసీగా నిమ్మగడ్డ కొనసాగడం సరికాదంటూ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

By

Published : Jun 10, 2020, 11:54 AM IST

ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నరు విచక్షణాధికారం మేరకు జరగాలని, ఈ విషయంలో మంత్రి మండలి పాత్ర ఏమి ఉందదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈ​సీగా కొనసాగడం సరికాదని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత ఐజీ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ (కోవారెంటో ) వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఎస్ఈసీగా రమేశ్ కుమార్ కొనసాగింపు ఏపీ హైకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. మంత్రి మండలి సిఫారసు మేరకు రమేశ్ కుమార్ 2016లో ఎస్ఈసీగా నియమితులయ్యారని గుర్తు చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు.

ఇవీచూడండి:పోలీసులు విశ్రాంతి తీసుకోండి: డీజీపీ మహేందర్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details