ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామంలో రైతులు అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని ఓ పెంపుడు శునకానికి చిరుత పులిలా మచ్చలు వేశారు. దానిని చూసిన అడవి జంతువులు భయపడి పారిపోతున్నాయి.
పంట రక్షణ కోసం.. పులి వేషంలో పెంపుడు కుక్క
ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామ రైతులు వినూత్నంగా ఆలోచించారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుతునేందుకు చిరుత వన్నె శునకం తయారు చేశారు. పెంపుడు శునకానికి చిరుతలా మచ్చలు పెట్టి పొలంలో వదిలారు. అప్పటి నుంచి దానికి భయపడి అడవి జంతువులు రావట్లేదని... రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ కుక్క యజమానురాలు, పక్క పొలం మహిళా రైతులు మాట్లాడుతూ గ్రామంలో పంటలకు కోతులు, అడవి జంతువుల, పక్షుల నుంచి రక్షించుకునేందుకు వినూత్నంగా ఆలోచించి పెంపుడు కుక్కకు పులి చారలు వేశామని అన్నారు. ఆ కుక్కుని చూసి కోతులు, పక్షులు భయంతో అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. వినూత్న ఆలోచనతో పంటలను సంరక్షించుకున్నామని, ఈ సందర్భంగా పంటలను కాపాడుతున్న కుక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:భద్రాద్రి మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తయేదెన్నడో?