ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడకు చెందిన కార్నా వెంకట చలపతి అనే వ్యక్తి శ్వాస సమస్యలతో కన్నుమూశాడు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిన స్థితిలో.. అతడి బంధువులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంతసేపు చెట్టు కింద, అనంతరం ట్రై సైకిల్ మీద కూర్చోబెట్టారు. చివరికి అక్కడి సిబ్బంది సరిగా పట్టించుకోలేదని.. ఆక్సిజన్ అందక తీవ్రంగా కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబీకులు ఆవేదన చెందారు. ఈ ఘటన చూపరులను కలిచివేసింది.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రాణవాయువు అందక మృతి - నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో శ్వాస అందక వ్యక్తి మృతి
ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడకు చెందిన కార్నా వెంకట చలపతి.. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే మృతి చెందాడని.. అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి బలి
ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు సకాలంలో స్పందించకపోవడం వల్లే వెంకట చలపతి మరణించాడని.. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోడివాక చందు ఆరోపించారు. అతడి మృతికి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.