మద్యానికి బానిసైన వ్యక్తి మత్తు కోసం శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరిగింది. కడప రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న పురుషోత్తం కరెంట్ పనులు చేస్తుంటాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మద్యం ధరలు భారీగా పెరగటంతో అతను మద్యం కొనలేకపోయాడు. దాంతో మంగళవారం మత్తు కోసం శానిటైజర్ తాగాడు.
మద్యం కొనలేక.. మత్తు కోసం శానిటైజర్ తాగి వ్యక్తి మృతి - కడప క్రైమ్ వార్తలు
మద్యం దొరక్క మత్తు కోసం రసాయనాలు తాగి మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. మందు ధరలు పెరగటంతో దాన్ని కొనలేక.. మత్తు కోసం శానిటైజర్ తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఏపీలోని కడప నగరంలో జరిగింది.
మద్యం కొనలేక.. మత్తు కోసం శానిటైజర్ తాగి వ్యక్తి మృతి
అస్వస్థతకు గురైన అతన్ని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కలిసి మందేశారు.. లూడో ఆడారు... ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు