తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఊపిరి అందక బాధపడటంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. వారు వచ్చేసరికే అతను మృతిచెందాడు. అతని భార్యకూ వైరస్ సోకడం వల్ల ఆమె బోడనకుర్రు క్వారంటైన్లో ఉంటోంది. ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకూ ఎవరూ ముందుకు రాకపోవటం వల్ల అతని మృతదేహం ఇంటి ముందే ఉంది.
కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం - వానపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి వార్తలు
కరోనా.. ఈ పేరు వింటేనే జనం భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి సోకుతుందో.. ఎలా బలితీసుకుంటుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. మరీ ముఖ్యంగా బంధాలను దూరంచేస్తోంది. మానవత్వం అనే మాటను మరిచిపోయేలా చేస్తోందీ ఈ మహమ్మారి. వైరస్‌తో చనిపోతే అయినవాళ్లే మొహం చాటేసేలా చేస్తోంది. ఓ వ్యక్తి కొవిడ్‌తో చనిపోతే ఒక రాత్రంతా అనాథ శవంలా గుమ్మం ముందే ఉన్న ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలో జరిగింది.
కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం