తెలంగాణ

telangana

ETV Bharat / city

పాడె పైనుంచి లేచినా ప్రాణం మిగల్లేదు - telangana latest news

అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి మరణించాడని అందరూ అనుకున్నారు. అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువెళ్తుండగా... లేచి కూర్చున్నాడు. అతడి పరిస్థితి చూసి, ఆసుపత్రిలో చేర్పించారు. 24 గంటలు గడవకముందే కన్నుమూశాడు.

పాడె పైనుంచి లేచినా ప్రాణం మిగల్లేదు
పాడె పైనుంచి లేచినా ప్రాణం మిగల్లేదు

By

Published : Dec 23, 2020, 9:51 AM IST

పాపం అభాగ్యుడు.. పాడె వదిలినా ప్రాణం నిలవలేదు. అంత్యక్రియలకు తీసుకెళుతుండగా లేచి కూర్చొన్న ఓ వ్యక్తి.. 24 గంటలు గడవక ముందే ప్రాణాలు విడిచాడు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామస్థులు అంత్యక్రియలకు తీసుకెళుతుండగా స్పృహలోకి వచ్చిన ఘటన సోమవారం జరిగింది.

రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆయన్ను మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:పైసలిస్తేనే జనన, మరణ ధ్రువపత్రాలు

ABOUT THE AUTHOR

...view details