విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొండ తాడూరుకు చెందిన గిరిజనుడు అనారోగ్యంతో బాధపడుతూ 5 రోజులక్రితం సాలూరు ఆసుపత్రిలో చేరాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయని పరీక్ష చేశారు. అయితే ఫలితాలు రాకముందే బుధవారం మృతిచెందాడు. అతనికి సంబంధించిన వారేవరూ రాకపోయేసరికి గుర్తుతెలియని మృతదేహంగా ఆసుపత్రిలో భద్రపరిచారు. పోలీసులు, అధికారులు అతని కుటుంబసభ్యుల ఆచూకీ తెలుసుకుని సమాచారమివ్వగా మృతుని తండ్రి వచ్చాడు.
కొవిడ్ విషాదం: ఆ నలుగురూ రాని ధైన్యం.. అధికారులకూ పట్టని దీనం! - సాలూరులో కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి
కరోనా లక్షణాలతో మృతిచెందిన కుమారుడి మృతదేహాన్ని ఒంటరిగా శ్మశానానికి తీసుకెళ్లాడు తండ్రి. అయితే ఆసుపత్రిలో మరణిస్తే కనీస రక్షణ చర్యలు చేపట్టలేదు అధికారులు. తండ్రి ఒక్కడే పీపీఈ కిట్లు, గ్లౌజులు లాంటివేమీ ధరించకుండా బల్లపై కుమారుడ్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది.
![కొవిడ్ విషాదం: ఆ నలుగురూ రాని ధైన్యం.. అధికారులకూ పట్టని దీనం!](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
అంత్యక్రియలకు ఎవరూ సాయం చేయకపోయేసరికి ఒక్కడే బల్లపై కుమారుడి మృతదేహాన్ని ఉంచి అరకిలోమీటరు దూరంలోని శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. పురపాలక సిబ్బంది తీసిన గోతిలో పూడ్చిపెట్టాడు. అయితే అతను కరోనా లక్షణాలతో మృతిచెందినప్పటికీ అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. మృతుని తండ్రికి పీపీఈ కిట్లు, గ్లౌజులు లాంటివేమీ ఇవ్వలేదు. దీనిపై ఆసుపత్రి వైద్యుల్ని అడగగా.. అవన్నీ పురపాలక అధికారులు, పోలీసులు చూసుకోవాలని చెప్పారు.
TAGGED:
saluru corona died