తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​కు సాధ్యం కానిది... జగన్ చేసి చూపించారు' - కేసీఆర్​పై పేర్ని నాని వ్యాఖ్యలు

దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటే పక్కరాష్ట్ర ముఖ్య మంత్రి కుదరదని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. సీఎం జగన్ మాత్రం దీనిని సాధ్యం చేశారని అన్నారు.

perni-nani-sensational-comments-on-kcr
'కేసీఆర్​కు సాధ్యం కానిది... జగన్ చేసి చూపించారు'

By

Published : Jan 1, 2020, 8:38 PM IST

ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విలీనం పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో పాటు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారని గుర్తు చేశారు. తాము మాత్రం చేసి చూపించామన్నారు. అందుకే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కంటే... సంకల్పం ఉన్న సీఎం అవసరమని కేసీఆర్​ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మనసు కావాలి..

కనీవినీ ఎరుగని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని పేర్కొన్నారు. విలీనం చేసేందుకు కావాల్సింది డబ్బు కాదు.. మనసు ఉండాలని స్పష్టం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు కృషి చేయాలని సూచించారు.

'కేసీఆర్​కు సాధ్యం కానిది... జగన్ చేసి చూపించారు'

ఇవీ చూడండి: నన్ను వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు: ఈటల

ABOUT THE AUTHOR

...view details