సినీ పరిశ్రమ గురించి జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి పేర్ని నాని హితవు పలికారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాను బందరులో గెలిస్తే.. పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. 'మా' ఎన్నికల్లో ఓట్ల కోసం పీకే అనేక తిప్పలు పడ్డారన్నారు.
perni nani on pawan: 'జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు' - జగన్‌పై పవన్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్‌కల్యాణ్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సినీ పరిశ్రమ గురించి పవన్ నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటని నిలదీశారు. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసిందన్నారు. పవన్‌కల్యాణ్‌కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, సీఎం కేసీఆర్‌ను తిట్టాలన్నారు.
"నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుంది. లవ్‌స్టోరీ సినిమా 510 థియేటర్లలో 3 రోజులుగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వకీల్‌సాబ్ సినిమాకు దిల్‌రాజు షేర్ రూ.80 కోట్లు. ఏపీలో రూ.55 కోట్లు, తెలంగాణలో రూ.25 కోట్లు వచ్చాయి. పీకేకు వచ్చే రూ.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా ?. పేదల ఖాతాల్లో మా ప్రభుత్వం వేసేది ఏటా రూ.60 వేల కోట్లు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటి?. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసింది. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను తిట్టాలి. నా అభిమానుల సంఘం అధ్యక్షుడు.. పీకే. పవన్ కల్యాణ్ మనసు నిండా నేనే ఉన్నా. కోడికత్తి కేసును ఎన్‌ఐఏ చూస్తోంది. పీకేకు దమ్ముంటే కోడికత్తి కేసు గురించి కేంద్రాన్ని అడగాలి. మోదీ, అమిత్‌షాను గట్టిగా అడగాలి" -పేర్ని నాని, మంత్రి
ఇదీ చదవండి:పవన్‌కు మద్దతుగా నాని.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి