పాపికొండల పర్యటనకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం దాదాపు 18 నెలలుగా పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. ఎట్టకేలకు ఏపీ పర్యాటక శాఖకు సంబంధించిన ఓ బోటుకు జలవనరులశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.
పాపికొండల పర్యటనకు పచ్చజెండా
పాపికొండల పర్యటనకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం దాదాపు 18 నెలలుగా పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. ఎట్టకేలకు ఏపీ పర్యాటక శాఖకు సంబంధించిన ఓ బోటుకు జలవనరులశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.
పాపికొండల పర్యటన
ఈనెల 15న పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి వద్ద నుంచి బోటు బయలుదేరనున్నట్లు ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ టి.ఎస్.వీరనారాయణ తెలిపారు. పాపికొండల పర్యాటకులకు టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. పోశమ్మగండి, సింగనపల్లి వద్ద కంట్రోల్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి:కేటీఆర్ సార్ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?