తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులుగా పేరాల శేఖర్​రావు - perala shekar rao got central post

భాజపా సీనియర్ నేత పేరాల శేఖర్ రావును కేంద్ర ప్రభుత్వం జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులుగా నియమించింది. పేరాల శేఖర్​ రావుకు సముచిత పదవి ఇచ్చినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

perala shekar rao appointed as central kadhi rural industries board member
perala shekar rao appointed as central kadhi rural industries board member

By

Published : Jan 22, 2021, 8:50 PM IST

భాజపా సీనియర్ నేత పేరాల శేఖర్ రావును కేంద్ర ప్రభుత్వం జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులుగా నియమించింది. దీనిపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన పేరాల శేఖర్ రావుకు జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న పేరాల శేఖర్​ రావు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన పేరాల... గతంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్​ జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చూడండి: తెరాస, కాంగ్రెస్​ కాంగ్రెస్​ కార్యకర్తల బాహాబాహీ

ABOUT THE AUTHOR

...view details