కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్లు... ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఓ పాఠశాల వద్ద... అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ఇన్స్పెక్టర్ యాదగిరితో కలిసి ప్రజా చైతన్య యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్దర్ సూచించారు. ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ - ప్రజా చైతన్య యాత్ర
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా గాయకుడు గద్దర్... ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోతుకుంటలో యాత్రకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ