తెలంగాణ

telangana

ETV Bharat / city

'బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ వద్దు'

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్న అధికారులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో కొవిడ్​ కేంద్రం వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.

'బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ వద్దు'
'బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ వద్దు'

By

Published : Jul 21, 2020, 4:18 PM IST

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానికులు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్య క్వారంటైన్ సెంటర్ వద్దంటూ సుండ్రుపుట్టు, లోచలి పుట్టు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడి నుంచి పంపించి వేశారు. వసతి గృహంలో అసలు సౌకర్యాలు లేవని.. మరుగు, మంచినీటి సదుపాయాలు లేకుండా రోగులను ఎలా ఉంచుతారని నిలదీశారు. వైరస్​ సోకిన వారిని అక్కడే ఉంచితే.. వ్యాప్తి మరింత ఎక్కువ అవుతుందని అభిప్రాయపడ్డారు. క్వారంటైన్​ కేంద్రాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాల రహదారి దిగ్బంధించి మూసివేశారు.

ఇదీ చూడండి

'దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించండి'

ABOUT THE AUTHOR

...view details