హైదరాబాద్‌లో గత వారం కురిసిన భారీ వర్షాలకు అబిడ్స్ ట్రూప్ బజార్లో కూలిన గోడ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, నాయకులు ఎవ్వరూ పట్టించుకోవటం లేదని స్థానికులు స్థానికులు ఆందోళనకు దిగారు. రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న గోడ కూలి ట్రాన్స్ ఫార్మర్పై పడింది.
కూలిన గోడను తొలగించాలంటూ కాలనీవాసుల ఆందోళన - hyderabad rains
హైదరాబాద్ అబిడ్స్‌లోని ట్రూప్ బజార్లో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. భారీ వర్షాలకు గోడ కూలి... వారం రోజుల నుంచి విద్యుత్, మంచి నీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలిన గోడను తొలగించాలంటూ కాలనీవాసుల ఆందోళన
ఈ ప్రమాదం వల్ల వారం రోజులుగా విద్యుత్, మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ట్రూప్ బజార్‌లోని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, నాయకులు ఎవరు తమ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కూలిన గోడను తొలిగించి... ట్రాన్స్ ఫార్మర్ను రిపేర్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.