Tension At Bobbili: పీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలోని మైథాన్ పరిశ్రమ మద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళనలు చేస్తున్న మహిళల్ని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tension At Bobbili: బొబ్బిలిలో ఉద్రిక్తత.. పోలీసులపైకి మట్టి విసిరిన ఆందోళనకారులు - Tension At Bobbili
Tension At Bobbili: ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని మైథాన్ పారిశ్రామికవాడలో ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ.. స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళనలు చేస్తున్న మహిళల్ని.. పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు మహిళలు పోలీసులపై మట్టి చల్లటంతో ప్రాంతమంతా రణరంగంగా మారింది.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ.. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు.. పోలీసులపై మట్టిచల్లారు. దీంతో ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఠాణాల్లోనూ ఆందోళన చేపట్టారు. మహిళలని చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులు వారించే ప్రయత్నం చేసినా.. ఆందోళనకారులు వినలేదు. మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో.. అదనపు సిబ్బందిని మోహరించారు.
ఇదీచూడండి:Bus ticket to Cock: బస్సెక్కిన కోడి.. టికెట్ కొట్టిన కండక్టర్.. స్పందించిన సజ్జనార్..