తెలంగాణ

telangana

ETV Bharat / city

గోదావరి వరద ముంపులోనే పలు గ్రామాలు, ప్రమాదకరంగా ప్రజల ప్రయాణం - Dhavaleshwaram project latest news

Godavari Floods People Facing Problems: గోదావరి వరద గణనీయంగా తగ్గినప్పటికి ఏపీలో డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలోని.. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్​వే ఈరోజు కూడా వరద ముంపులోనే ఉంది. అక్కడి ప్రజలు ముంపులో ఉన్న కాజ్​వేపై నుంచి ప్రమాదకరంగా చాకలిపాలెం వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

గోదావరి వరద
గోదావరి వరద

By

Published : Sep 25, 2022, 4:00 PM IST

Godavari Floods People Facing Problems: గోదావరి వరద గణనీయంగా తగ్గినప్పటికి ఆంధ్రప్రదేశ్​లో డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలోని.. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్​వే ఈరోజు కూడా వరద ముంపులోనే ఉంది. కనకాయలంక గ్రామ ప్రజలు ముంపులో ఉన్న కాజ్​వేపై నుంచి ప్రమాదకరంగా చాకలిపాలెం వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ఈరోజు 2,75,000 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెట్టారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు సముద్రంలోకి విడిచి పెడుతున్న వరద నీరు సగానికి తగ్గింది. అయినా ఇక్కడ కాజ్​వే ఇంకా ముంపులోనే ఉంది.

గోదావరి వరద ముంపులోనే పలు గ్రామాలు, ప్రమాదకరంగా ప్రజల ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details