తెలంగాణ

telangana

ETV Bharat / city

బస్సుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు - టీఎస్​ఆర్టీసీ బస్సు దగ్ధం

People Burnt TSRTC Bus in Patancheru సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు బస్టాండ్​లో నిలిపి ఉన్న ​బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

bus on fire
బస్సుకు నిప్పు

By

Published : Aug 24, 2022, 9:50 AM IST

People Burnt TSRTC Bus in Patancheru : ప్రయాణ ప్రాంగణంలో నిలిపిన ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ బస్సుకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ బస్సు ముషీరాబాద్ -2 డిపోకు చెందిన ఏపీ11జెడ్ 6893 నెంబర్ బస్సుగా గుర్తించారు. అక్కడే ఉన్న ప్రయాణ ప్రాంగణ సెక్యూరిటీ, ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లేకపోతే బస్సు మెుత్తం అగ్ని ఆహుతి అయ్యేది.

అప్పటికే నాలుగు సీట్లు దగ్ధమైనట్లు బీహెచ్ఇఎల్ డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని సుధాకర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details