ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా అట్లూరు వ్యవసాయ పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో అన్వేషకుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్దలు, పిల్లలు పెద్దఎత్తున తరలివచ్చి వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పొలాల్లో తెల్లటి రంగు రాళ్లు బయటపడుతున్నాయి.
ఏపీ: పొలాల్లో వజ్రాలు.. స్థానికుల పరుగులు
ఏపీలోని కడప జిల్లా అట్లూరు వ్యవసాయ పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో.. ప్రజలు అక్కడికి భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పొలాల్లో తెల్లటి రంగు రాళ్లు బయటపడుతున్నాయి. వీటినే వజ్రాలుగా భావించి.. పొలాల్లో వేట సాగిస్తున్నారు.
పొలాల్లో వజ్రాలున్నాయనే వదంతులు, పొలాల్లో వజ్రాల కోసం స్థానికుల వేట
వీటినే వజ్రాలుగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పొలాల్లో వేట సాగిస్తున్నారు. ఇందుకు తోడు... కొందరికి ఇక్కడి వ్యవసాయ పొలాల్లో వజ్రాలు దొరికినట్లు పుకార్లు రావడంతో స్థానికులు పరుగులు పెడుతున్నారు.
ఇదీ చదవండి:Harish rao: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై మంత్రి హరీశ్ సమీక్ష